Love Marriage : ఈరోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. చాలామంది యువత ప్రేమ వివాహాల వైపే మొగ్గు చూపుతున్నారు. కుల,మతాలు వేరైనప్పటి కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకొని పెద్దలను ఒప్పించి, పెద్దలు ఒప్పుకోకపోతే వారే స్వయంగా ప్రేమ వివాహం చేసుకుంటున్నారు.
కుటుంబ సభ్యులు తమ ప్రేమను ఒప్పుకొని జంటలు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు, వారికి ఇరువురి కుటుంబాల నుంచి ప్రమాదం ఉంటుంది. అలాంటివారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంటలకు ఒక శుభవార్త ,ఇలాంటి వారికి ఆశ్రయం కల్పించి, దగ్గరుండి పెళ్లి చేసే ఒక ఆలయం ఉంది.
మీరు విన్నది నిజమే ప్రేమజంటలకు రక్షణ కల్పించే ఆ ఆలయం, ఆ ఊరు ఎక్కడ ఉందో చూద్దాం. ఆ ఆలయం మరి ఎక్కడో కాదు మన ఇండియాలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని కులు షాంఘర్ గ్రామంలోనీ షాంపుల్ మహాదేవ్ ఆలయం అది.ఈ ఆలయం శివాలయం. ఈ ఆలయం దట్టమైన చెట్ల మధ్య పచ్చని అడవిలో ఉంటుంది.
ఈ ఆలయంలోని శివుడు భక్తుల కోరికలు తీర్చడమే కాకుండా ఇక్కడికి పారిపోయి వచ్చిన ప్రేమీకులకు ఆశ్రయమిస్తాడు. అక్కడి గ్రామస్తులు ప్రేమికులకు వివాహం చేసిన తర్వాత ఆశ్రయం కూడా కల్పించి, వారి ఇరువురీ కుటుంబ సభ్యులు రాజీ పడే వరకు వారిని అక్కడే జాగ్రత్తగా ఉంచుతారు. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ ఊరిలోకి పోలీసులు రావడం నిషేధం. ఇప్పుడు ఆ ఊరి గురించి ,ఆ ఆలయం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.