Mainsh Sisodia arrested by CBI in Delhi liquor policy case:ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం… ఢిల్లీ డిప్యూటీ సియం అరెస్ట్
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ అంత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రశ్నించడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని తమ కార్యాలయానికి పిలిపించిన సిబిఐ, ఈడీ దాదాపు 8 గంటల విచారణ అనంతరం తాజాగా అరెస్ట్ చేసింది.
ఆయనతోపాటు విజయ్ నాయర్, అమిత్ అరోరా,అభిషేక్ బోయిన్పల్లి, గౌతమ్, రాజేష్ జోషి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, బినోయ్ బాబుతో పాటు ఏపీ వైసీపీ నేత మాగుంట శ్రీనివాసులు కొడుకు మాగుంట రాఘవ తదితరులు ఉన్నారు.
లిక్కర్ స్కామ్ లో సిసోడియా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఈ అరెస్ట్ లు జరిగినట్లు సిబిఐ,ఈడీ పేర్కొంది. అయితే సిబిఐ, ఈడీ మనీష్ సిసోడియాని కష్టడీ కి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. అయితే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా ఉన్న సంగతి తెలిసిందే.దీనితో మున్ముందు మరిన్ని అరెస్టులు జరుగుతాయో అనే ఉత్కంఠ నెలకొంది.ప్రస్తుతం సీబిఐ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు.