• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Janasena News

Manohar – Press Meet : భీమవరంలో జనసేన పాదయాత్రపై వైసీపీ దారుణం మాములుగా లేదుగా.. 

Rama by Rama
September 7, 2023
in Janasena News, Latest News, Political News
0 0
0
Manohar – Press Meet : భీమవరంలో జనసేన పాదయాత్రపై వైసీపీ దారుణం మాములుగా లేదుగా.. 
Spread the love

Manohar – Press Meet : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం తెనాలిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఇప్పటికె జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని నిర్ణయానికి వచ్చారు.. మరో ఆరు నెలలు ఉండే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరించి, భయపెట్టి నియంత పాలన సాగించాలని ప్రయత్నం చేస్తోందని  ప్రజాస్వామ్యంలో కేవలం పాలకపక్షం చెప్పిందే జరగదు. ప్రజల సమస్యల కోసం, క్షేత్ర స్థాయిలోని పరిస్థితిని, పాలన లోపాలను బయటపెట్టి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రతి పాత్ర చాలా ప్రధానమైనది. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ప్రతిపక్షాలకు ఉంటాయి అన్నారు.

పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించే సమయంలో కూడా అధికార పార్టీ నాయకులు ఎంతగా రెచ్చగొట్టాలని ప్రయత్నించినా జనసైనికులు ఎంతో సమన్వయంతో క్రమశిక్షణగా మెలిగారు. అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటలల్లో పోలీసులు సోదాలు పేరుతో ఇబ్బంది పెట్టి 42 మంది జనసేన నాయకుల మీద హత్యయత్నం కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తోంది. పోలీసులతో అన్యాయంగా హత్యయత్నం కేసులు, ఇతర కేసులను పెట్టిస్తున్నారు.

దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడే హక్కు, పోరాడే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని పాలకపక్షం గుర్తించాలి అని వెల్లడించారు. గత రెండుమూడు రోజులుగా చూస్తున్నాం. ఇతర జిల్లాల్లో ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిన పాదయాత్రను కావాలని అలజడి సృష్టించి భయానక వాతావరణం కలగజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరంలో కావాలనే దాడులు చేశారు.

అధికార పార్టీ, వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నింది. తెలుగుదేశం పార్టీ నాయకులపైన హత్యాయత్నం కేసులు పెట్టారు. మేము వారాహి యాత్ర భీమవరం వచ్చిన సందర్భంగా రెచ్చగొట్టేలా అధికార పార్టీ నాయకులు ప్లెక్సీలు కట్టారు. పెత్తందారి ఫ్లెక్సీలను ఆ సమయంలో కూడా సభ వేదిక దగ్గరలోనే కట్టి, జనసైనికులను రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. మేం ఎంతో సంయమనంతో వ్యవహరించాం. పాలకపక్షం తలుచుకుంటే ప్రతిపక్షాలను కేసులు పెట్టి ఎన్ని తిప్పలు అయినా పెట్టించవచ్చు అనే కొత్త సంప్రదాయాన్ని రాష్ట్రంలో తీసుకొస్తున్నారు, ప్రతిపక్ష, పార్టీలు నాయకుల మీద వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులకు పాల్పడడం వైసీపీ ప్రభుత్వం మానుకోవాలి.

కిందిస్థాయి. కార్యకర్తలు పోలీస్ కేసులతో ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రంలో స్వేచ్చయుత వాతావరణాన్ని ప్రభుత్వం కాపాడాలి. విపక్షాలపై తప్పుడు కేసులను పెట్టుకుంటూ వెళితే అది ప్రమాదకర సంకేతాలు ప్రజల్లోకి పంపుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షగట్టి జరుపుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.

 


Spread the love
Tags: AP NewsBjpChandrababuNaiduJanaSainikJanasenaJanasena veera mahilaluManohar - Press MeetManohar Press Meet at BhimavaramNadendla ManoharNagababuTdpYCPYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.