• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Chiranjeevi: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై చిరంజీవి స్పందన.. మృతులకు ప్రగాఢ సానుభూతి

Chiranjeevi: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై చిరంజీవి స్పందన.. మృతులకు ప్రగాఢ సానుభూతి

Sandhya by Sandhya
September 28, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Chiranjeevi: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై చిరంజీవి స్పందన.. మృతులకు ప్రగాఢ సానుభూతి
Spread the love

Chiranjeevi: విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై చిరంజీవి స్పందన.. మృతులకు ప్రగాఢ సానుభూతి

 

Chiranjeevi: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ఘటనపై తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఎక్స్ ద్వారా స్పందించారు. “తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనలో 39 మందికి పైగా మరణించగా, వారిలో ఎనిమిది మంది చిన్నారులు, 16 మందికి పైగా మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 400 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ విషాదం విజయ్ అభిమానులతో పాటు రాజకీయ వర్గాలను కూడా కలచివేసింది. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి నివేదిక కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ఆసుపత్రుల్లోని బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు. లక్ష మందికి పైగా కిక్కిరిసిన ఈ సభలో ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.


Spread the love
Tags: 39 people killed in Tamil Nadu stampedeChiranjeevi's tweet on Vijay rally stampedeKarur rally stampedeTVK Vijay rally stampedeVijay rally stampedeకరూర్ ర్యాలీ తొక్కిసలాటటీవీకే విజయ్ ర్యాలీ తొక్కిసలాటతమిళనాడు తొక్కిసలాటలో 39 మంది మృతివిజయ్ ర్యాలీ తొక్కిసలాటవిజయ్ ర్యాలీ తొక్కిసలాటపై చిరంజీవి ట్వీట్
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.