Mobile Technical Tips : ఇప్పుడు ఉన్న జనరేషన్ కు మొబైల్ వాడకం ఎలా ఉందో మనకు తెలుసు.. మొబైల్ తోటే చాలా పనులు ముడిపడి ఉన్నాయి. మొబైల్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేని పరిస్థితుల్లోకి ఈరోజు చాలామంది వచ్చేసారు. మొబైల్ వినియోగాలు కూడా 4జి నుంచి 5జి కి మారాయి. ఎక్కువ స్పీడ్ ఉండటంతో 5జి జనరేషన్ చాలామంది వాడుతున్నారు.
5జి ఇంటర్నెట్ కూడా నెమ్మదిగా ఉంటుందని చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు డేటా స్పీడ్ పెరగడానికి ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. మొదట మీ మొబైల్ 5జీ నెట్వర్క్కి కనెక్ట్ అయిందా? లేదా? అనేది చూసుకోవాలి. ఫోన్ సెట్టింగ్స్ లలో, సెల్యులార్ డేటా ఆప్షన్ కింద ఫోన్ కనెక్ట్ అయిన నెట్‌వర్క్‌ల లిస్ట్‌ను చెక్ చేయాలి.
అలా చేసినప్పటికీ డేటా ఆన్ కాకపోయినా, లేక లేక స్లోగా ఉన్నా ఫోన్‌ని రీస్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ డేటా స్పీడ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోన్ ని రీస్టార్ట్ చేస్తే పవర్ ఆఫ్ స్లైడర్ కనిపించే వరకు బటన్ నొక్కి ఉంచాలి. పవర్ ఆఫ్ స్లైడర్ కుడి వైపుకు డ్రాగ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక నిమిషం ఆగి ఫోన్ ని ఆన్ చేయాలి.
బ్యాక్ గ్రౌండ్ లో ఏవైనా యాప్ లు ఓపెన్ అయి ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అలా ఉంటే ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అయిపోతుంది. ఐఫోన్లో అయితే హోమ్ బటన్‌ను రెండుసార్లు క్లిక్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే, స్క్రీన్ కింద నుంచి పైకి స్వైప్ చేయాలి. అవసరం లేని యాప్‌లను కూడా స్వైప్ చేయాలి.
ఫోన్లో రీసెంట్ గా చూసిన వెబ్సైట్ లోని యాప్ లను కూడా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే డేటా ఫోన్ స్టోరేజ్ చేస్తుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మేనేజ్మెంట్ స్టోరేజ్ కి వెళ్లి cache క్లియర్ చేయాలనుకునే యాప్ పై ప్రెస్ చేసి, clear cache ఆప్షన్ నొక్కలి.ఫోన్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
కొత్త ఫీచర్లు, బగ్ సొల్యూషన్ తో ఫోన్ సాఫ్ట్ వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఫోన్ ని అప్డేట్ చేయకపోతే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గే అవకాశాలు ఎక్కువ. ఎయిర్ ప్లేన్ మోడ్‌ని ఆన్ చేసుకొని, మళ్లీ ఆఫ్ చేయాలి. అలా చేయడం వల్ల నెట్ వర్క్ కనెక్షన్‌ని రీసెట్ చేసినందుకు స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.