Morning Motivation:మేల్కొలుపు-12
చిన్నప్పుడు అనుకుంటాం..నాకు అందరూ ఉన్నారని..
పెరుగుతున్నప్పుడు అనుకుంటాం..అందరూ దూరం అయితే ఉండలేము అని
ఇక ఇప్పుడు అనుకుంటున్నాం..చివరిదాకా మనకు మనమే తప్ప ఎవరూ తోడు ఉండరు అని..
మనిషి ని అర్థంచేస్కోటం కష్టం
కానీ
అపార్థం చేస్కోటం సులభం.
నమ్మిన వ్యక్తి మీద ఎవరేం చెప్పిన సులభంగా నమ్మలేం..కానీ
ఒకసారి నమ్మేస్తే వజ్రాన్ని కోల్పోతాము…
ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహంతో ఉంటే చెడగొట్టే వాళ్ళు చాలానే ఉంటారు..
కానీ…
అదే వ్యక్తులు విడిపొతే కలిపేవాళ్ళు ఉండరు…
అర్థం చేస్కుంటే రాక్షసుడు కూడా దేవుడిలా కనిపిస్తాడు..
అపార్థం చేస్కుంటే దేవుడు కూడా రాక్షసుడిలా కనిపిస్తాడు..
ఇప్పుడు ఉన్న కాలంలో తప్పు ఒకరిది అయితే శిక్ష మరొకరిది..
తప్పు చేసిన వాళ్ళు సుఖసంతోషాలతో ఉన్నారు..
చేయని వాళ్ళు బాధ దుఖాలతో ఉన్నారు..
మనిషి ని నమ్మాలి మెషిన్ లను కాదు..
నమ్మకం పొందిన మనిషి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి..
అప్పుడే ఆ జీవితానికి ఒక పరమార్థం తెలుస్తుంది.
శుభోదయం
