Morning Motivation:మేల్కొలుపు-9
జీవితం అంటే ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే..
తనువుకు లోపల మాత్రమే తాను ఉన్నానని అనుకుంటే – జీవుడు
తనువుకు లోపల,బయట తానున్నానని తెలుసుకుంటే- దేవుడు.
ఎదుటివారు మనకు ఏమిచ్చారు అనే దాన్ని బట్టి కాదు..మనం
ఎదుటివారికి ఏమిచ్చాం అనే దాన్ని బట్టి మన విలువ మారుతుంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..
మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు…కానీ
మనం బాధపెట్టకపోయినా సరే మనల్ని బాధపెట్టినవారు బాధ పడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది.
ఇష్టంతో చేసే పని…శక్తిని పెంచుతుంది
కష్టంతో చేసే పని.. శక్తిని తగ్గిస్తుంది..
కాబట్టి
చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు.
అంతా మంచే జరుగుతుంది..
కాకపోతే వెనకా ముందు అంతే
కాలం అనేది చూసుకుంటుంది.
“శుభోదయం”