Nadendla Manohar – Jagan : ఎవరికి దొరకినట్టు వారు దోచుకోవడమే వైసీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. అవినీతికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు మార్చేశారు. ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి, భారీ స్థాయి స్కాముల వరకు వైసీపీ నాయకులు బహిరంగంగా చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు నాణ్యంగా లేవని, విద్యుత్ లో వోల్టేజీ వస్తోంది అనే సమస్యను ప్రజలు, నాయకులు చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు మీదే రూ. 22 వేల కోట్ల అవినీతి జరిగింది.
20 సంవత్సరాలుగా సరిపడా ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి బాధ్యతను వైసీపీ ముఖ్య నేత బినామీ కంపెనీకి కట్టబెట్టి, భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ అక్కడ అని లేదు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి అంశం అవినీతితో ముడిపడి ఉంది. సామాన్యులు మధ్యతరగతివారు వైసీపీ ప్రభుత్వ అవినీతి దెబ్బతో నలిగిపోతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి అని నాదెండ్ల తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం దక్కించుకోవడానికి దుష్ట పన్నాగాలు పన్నుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చెప్పినట్లు ఎన్నికల్లో చాలా గొడవలు జరుగుతాయి. వైసీపీకి క్షేత్రస్థాయి పరిస్థితి క్రమంగా అర్ధమవుతుంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వారి బల ప్రదర్శనతో అడ్డు కోవాలని చూస్తారు. దీనిని జన సైనికులు సంఘటితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ వైసీపీ పెద్దలు చాలామంది ఎమ్మెల్యేలకు ఎన్నికలు మేం చేస్తాం మీరు సైలెంట్ గా ఉండండి… అని చెప్పె స్థాయికి వెళ్లారంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో అర్ధం చేసుకోండి.
ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు తెర లేపిన వైసీపీ తీరును అడ్డుకుందాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం బలంగా పోరాడుదాం పని చేద్దాం.. సోషల్ మీడియాను బలంగా పార్టీ ఉన్నతి కోసం బలంగా ఉపయోగించండి. మనలో ఉన్న చిన్న మనస్పర్ధలు సైతం, ఇతర పార్టీలకు ఆయుధం కాకూడదు. అంతా ఒక కుటుంబంలో ముందుకు వెళ్లి మరింత మందిని మన కుటుంబంలో సభ్యులుగా చేసిలా పనిచేయండి. కార్మికులు, కర్షకులు, విద్యార్ధులు, మహిళలు ఇలా అందరినీ కలుపుకొని వారి సమస్యల మీద నిత్యం గళం ఎత్తుతూ ముందుకు వెళ్దాం అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసారు.