Nadendla Manohar Garu : జనసేన నిర్వహించిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. ఇసుక దోపిడి చాలా విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి గ్రామంలోనూ ఈ అక్రమ దంద నడుస్తుందని వెల్లడించారు. 1200 నుండి 1400 రూపాయలుకు దొరకవలసిన ట్రాక్టర్ ఇసుక ఈరోజు 14,15 వేలకు భారీగా పెరిగిపోయింది అంటే ఈ అక్రమ రవాణాకు కారకులు ఎవరు?
ఈ అక్రమ దందాను వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు? ఎవరి జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వం ఏమి పట్టించుకోకుండా ఈ అక్రమ రవాణాలను పెంచి పోషిస్తున్నాయి. ఈరోజు ఎన్నో ప్రాణాలు ఈ ఇసుక దందా వల్ల గాల్లో కలిసిపోయాయి. ఎన్నో కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారు అనీ ఆవేదన వ్యక్తం చేసారు. ఏ చోటు అంటూ వదలకుండా ప్రోక్లైన్లు పెట్టి ఇసుకను అక్రమ దందా చేస్తున్నారు.
కృష్ణానదిలోని విజయవాడ ప్రాంతంలో 136 మంది చిన్న పిల్లలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఇసుక రవాణాకు బలైపోయారు. నది దగ్గర ఇసుకను ఇష్ట రాజ్యాంగ ప్రోక్లిన్ తోటి తీయడం వల్ల, అది తెలియని పసిపిల్లలు, ఇసుక ఉందనుకొని వెళ్లి ఆ నీళ్లలో పడి చనిపోతున్నారు. ఈ ప్రభుత్వం మన వనరులన్నింటిని కొల్లగొట్టి, రాష్ట్ర ప్రజలందరినీ అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది .ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతో ఉంది. మనందరం కూడా ఆ వైపుగా ఆలోచన చేద్దాం అని నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు.