Nadendla Manohar : చక్రాయపాలెం ఆత్మీయ సభలో జనసేన పార్టీ నిర్వహించిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు..? రైతులపై ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. పోలవరం ప్రాజెక్టును ప్రకాశం బ్యారేజీ స్థాయిలో మార్చేశారు అన్నారు.
సమాజాన్ని కులాల వారీగా చీల్చి ఓట్ల కోసం చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్లో తన సహచర శాసనసభ్యుడు ఇంటిని తగలబెట్టించిన మనిషి, ప్రజలకు ఎలా మేలు చేస్తాడని నాదెండ్ల విమర్శించారు. చేసే ప్రతి ఒక్క పనిలో తమకు ఎటువంటి లాభం చేకూరుతుందనే నాయకుల పాలనలో మనం ఉన్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో రైతంగానికి నష్టం జరిగితే ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. రైతాంగం చాలా సంక్షోభంలో ఉందని. కేంద్రం ఇస్తున్న రూ. 7,500 కి తోడు ,రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. జనసేన ప్రభుత్వంలో కౌలు రైతుల కోసం పటిష్టమైన చట్టం తీసుకొస్తాం అని వెల్లడించారు.ప్రజల కోసం, వారి బాగు కోసం,
వారి అభివృద్ధి కోసం, ఆలోచించే నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే అని, అది జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నాదేండ్ల ఆశాభవాన్ని వ్యక్తం చేశారు.రాజధాని నిర్మాణం నిమిత్తం అప్పట్లో రాజకీయాలకు అతీతంగా అమరావతి రైతులు 30 వేల ఎకరాల భూమి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతికి తీరని ద్రోహం చేశారు.
ముఖ్యమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులతో మాట్లాడలేని ఈ ముఖ్యమంత్రికి, రైతుల మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. అని నాదెండ్ల ప్రభుత్వ పని తీరును విమర్శించారు. ప్రజలకు సెంటు భూమి ఇవ్వలేని చేతగాని ప్రభుత్వము, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఎటువంటి సహాయం చేయలేక పోతుంది.
వారికి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వలేక పోతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేక పోతుంది. ప్రభుత్వం పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోతుంది. ఎటువంటి లాభాలను రాష్ట్ర ప్రజలకు అందించలేక పోతుంది. అని నాదెండ్ల అసమర్థ ప్రభుత్వ తీరును బయటపెట్టారు.