Nadendla Manohar : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఈ ప్రభుత్వం అసలు నిజాలు దాస్తోంది. పోలవరం జగన్ రెడ్డి పాపాలకు వరం పథకంగా మారిపోయింది.
ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చే పోలవరం ప్రాజెక్టును కేవలం బ్యారేజీ స్థాయికి తీసుకువచ్చే కుట్రకు వైసీపీ రచన చేసింది అని నాదెండ్ల వెల్లడించారు. దీనిలో భాగమే కేంద్రం వద్ద ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి, 41.15 మీటర్లకు తగ్గిస్తూ చేసుకున్న ఒప్పందంపై వైసీపీ ముఖ్యమంత్రి సంతకం చేసి వచ్చారు. మంగళవారం పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు
వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీనిపై ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి మంగళవారం ముఖ్యమంత్రి చేపట్టబోయే పోలవరం సమీక్ష సమావేశం పూర్తి పారదర్శకంగా మీడియా సమక్షంలో జరగాలని అని నాదెండ్ల డిమాండ్ చేసారు. సరిగ్గా రెండు నెలల క్రితం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ త్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత పోలవరం మీద రాష్ట్ర
ప్రభుత్వం ఆడిన నాటకం బయటపడింది. దానిని వెంటనే ప్రజల ముందు పెట్టాం. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపైన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను మీడియా ముందు తెలియచేసిన వెంటనే రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వేగంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా నేను అబద్ధాలు చెబుతున్నానంటూ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నవి.
పచ్చి అబద్దాలు అని ఇప్పుడు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోలవరం ప్రాజెక్టు కోసం విడుదల చేసిన రూ.17,144 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం 41.15 మీటర్లకు ఎత్తు ఒప్పుకుంటేనే విడుదల చేసింది అని ఆయన వెల్లడించారు.