Nadendla Manohar : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు (ఆదివారం) పర్యటన చేయనున్నారు. జనసేన పార్టీ వరుస కార్యక్రమాలతో ముందుకు వెళుతుంది.జనసేనా పార్టీ రైతుల పరామర్శ, రాజమండ్రిలో కొత్త పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించడం లాంటి ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది.
అందులో భాగంగానే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆదివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగా ప్రమాదవశాత్తూ మరణించిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శించి రూ.5 లక్షల చెక్కులను అందచేయనున్నారు.
ఆ తరువాత ఒంగోలులో ఉదయం 11 గంటలకు మౌర్య హోటల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. కార్యక్రమం తదుపరి దర్శి నియోజకవర్గం తోట వెంకన్నపాలెం గ్రామానికి వెళ్లి. ఆ గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తరువాత సాయంత్రం చీరాలలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు.