Nadendla Manohar : జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో చేపట్టే వారాహి యాత్రపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పి.ఎ.సి. సభ్యులతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశానంతరం నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి..జూన్ 14 నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ప్రజల్లోకి రానున్న వారాహి యాత్ర గురించి ప్రకటన చేసారు. ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులు, పార్టీలోనీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ఇతర నాయకుల తోటి సుదీర్ఘ చర్చల అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్
కళ్యాణ్ గారి యాత్ర గురించి, ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అని నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. ఈ నెల 14 నుండి యాత్ర ప్రారంభం కాబోతోంది అనీ.. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో గల సత్యదేవుని దర్శించుకున్న తర్వాత, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మీదుగా ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది అని నాదెండ్ల వెల్లడించారు.
వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలు..ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్,ముమ్మిడివరం,అమలాపురం, అక్కడినుండి పశ్చిమగోదావరి జిల్లాలు అయినటువంటి పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఊర్ల మీదుగా యాత్ర సాగాలని ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం నిర్ణయించడం జరిగింది అని నాదెండ్ల మనోహర్ యాత్ర గురించిన విషయాలను వివరించారు.
ప్రతి నియోజకవర్గంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించే విధంగా, అలాగే ప్రతి ఒక్క సమస్యను ప్రజలు దగ్గర్నుంచి కులంకుశంగా తెలుసుకునే లాగా మేము ప్రణాళికను సిద్ధం చేశాము అని నాదెండ్ల తెలియజేసారు.