Nadendla Manoher : ప్రభుత్వ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను గుర్తించిన ప్రజలు వైసీపీ వాళ్ళను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం చేస్తున్నారు అని నాదెండ్ల మనోహర్ వైసీపీ తీరుపై మండి పడ్డారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లక్కనపల్లెలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన పార్టీ నాయకుడు మధుసూదన్ పై దాడి చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేము కార్యక్రమాల్లోని తప్పులను గుర్తించి.. అడగటమే ఆ బాధితుడు చేసిన తప్పా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
వైసీపీ చేస్తున్న తప్పులు బయటపడుతున్నాయి కాబట్టి అసహనంతో దాడులు చేస్తున్నారు. దీన్ని గడప, గడపకు దాడులు అనే కార్యక్రమంలా మార్చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి.. మధుపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ వాళ్ళకి గడప, గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించేటప్పుడు. గృహ నిర్బందాలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.