Nadendla Press Meet : మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసి రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపట్టి, బెదరించి అలజడులు సృష్టించాలని భావిస్తోంది. ఎలా అయినా ప్రజల్లో భయాందోళనలు కలిగించి వైసీపీ చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోంది.
ఇదే సూత్రంతో ప్రజలను వచ్చే ఎన్నికల్లో భయపెట్టి అయినా ఓట్లు వేయించుకోవాలనేది వైసీపీ నాయకులు ప్రణాళిక, అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రం, గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ ఎలాంటి విధ్వసం సృష్టించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదీ పద్ధతి అవలంబించాలని చూస్తోంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ పై నాదెండ్ల అన్నారు.
జనసేనా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ, తెలుగుదేశం పార్టీ పిలుపునచ్చిన బంద్ లో జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్నారు. అయితే కొన్ని చోట్ల జనసేన నాయకులపై పోలీసులు వ్యహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉందని కొన్ని ప్రాంతాల్లో కనీసం జనసేన జెండా కూడా పట్టుకోనివ్వలేదు.
గుంటూరు నగరంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షులు సరెళ్ల సురేష్ లను అన్యాయంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదే నగరంలో మేయర్, ఎమ్మెల్యే ప్రవర్తించిన లేరు. స్వచ్ఛందంగా దుకాణాలు మూస్తే బలవంతంగా తెరిపించేందుకు ఒత్తిడి చేయడం చూశాం, చట్టం వైసీపీకి వర్తించదా?
శాంతియుత నిరసనను, ప్రజలంతా స్వచ్చందంగా బంద్ లో పాల్గొంటే దానికి చెడగొట్టాలని వైసీపీ నాయకులు అలజడులు సృష్టించాలని చూశారు. అలాగే చాలా ప్రాంతాల్లో జరిపిన నాయకులు శాంతియుతంగా సంఘీభావం ప్రకటిస్తుంటే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. గుడివాడలో జనసైనికుడిపై సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేయడం కూడా మా దృష్టికి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని పోలీసులు కాలరాయడం సరైన పద్ధతి కాదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ సమయంలో కూడా ప్రజలకు అవాంతరం కలిగించే పనులను ప్రోత్సహించరు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కనీసం నిరసన తెలిపేందుకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా, హౌస్ అరెస్టులు చేసిన ఈ ప్రభుత్వ తీరు గర్తనీయం, వైసీపీ ప్రభుత్వం వైసీపీ చేస్తున్న అరాచకాన్ని నిలువరించాలంటే పోరాటం తప్పదు. ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన సమయం ఇది అన్నారు.