Lokah Chapter 1: ‘లోక-చాప్టర్ 1’ తెలుగులో తీస్తే డిజాస్టర్ అయ్యేది.. నిర్మాత నాగవంశీ కామెంట్స్
Lokah Chapter 1: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఇటీవల మలయాళంలో రికార్డులు సృష్టించిన ‘లోక-చాప్టర్ 1’ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు ప్రేక్షకుల దృక్పథం, ఇతర భాషల సినిమాలపై వారి ప్రతిస్పందన గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడారు.
తన బ్యానర్ నుంచి రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన నాగవంశీ, మలయాళ సినిమా ‘లోక’ తెలుగులో విడుదలైతే ఫ్లాప్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. “కొత్త లోక సినిమాను తెలుగులో తీసి ఉంటే అట్టర్‌ఫ్లాప్, డిజాస్టర్ అయ్యేది” అని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు ప్రేక్షకులకు లాజిక్‌లు, రియాలిటీ పట్ల ఉండే నిక్కచ్చి వైఖరే దీనికి కారణమని వంశీ వివరించారు. “తెలుగు ప్రేక్షకులు లాజిక్‌లు, రియాలిటీ గురించి మాట్లాడుతూ ‘ఇదేం సినిమా?’ అని ప్రశ్నిస్తూ ఫ్లాప్ చేసేవాళ్లు. మలయాళ ప్రేక్షకులు కథలో మునిగిపోతారు, ఎమోషన్స్‌కు లోనవుతారు. అదే తెలుగులో జరిగితే.. పచ్చి బూతులు తిట్టేవాళ్లు” అని నాగవంశీ వ్యాఖ్యానించారు. ఇటువంటి క్రాస్-కల్చరల్ కంటెంట్‌కు తెలుగు ప్రేక్షకుల అడాప్టబిలిటీ కీలకం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన అభిప్రాయానికి మద్దతు ఇస్తుండగా, మరికొందరు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తక్కువ చేసి చూపారని విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా, తన బ్యానర్ నుంచి వచ్చిన ‘వార్ 2’ ఫ్లాప్ గురించి కూడా నాగవంశీ ఓపెన్‌గా మాట్లాడారు. ఆదిత్య చోప్రాను నమ్మాం, కానీ మిస్‌ఫైర్ అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది అని ఆయన పేర్కొన్నారు. ఈ ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
