Nagababu in Germany : జనసేన పార్టీకి మద్దతు కోసం విదేశీ పర్యటన చేపట్టిన నాగబాబు ఎన్నారై లతో మమేకమవుతూ, పార్టీ భవిష్యత్ ప్రణాళికను చర్చిస్తూ, వారి సలహాలు తీసుకుంటూ, వారికున్నటువంటి సందేహాలు తీరుస్తూ బిజీ,బిజీ గా గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి, ఎలాగైనా జనసేన పార్టీ సత్తా చాటాలని ఒకవైపు పవన్ కళ్యాణ్ ,మరోవైపు నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎన్నారైల మద్దతు కోసం వారిని కలుస్తూ..సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలోనే యూరోప్ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు జర్మనీ చేరుకున్నారు. మ్యూనిచ్ విమానాశ్రయంలో నాగబాబు గారికి ఎన్ఆర్ఐ జనసేన జర్మనీ విభాగం సభ్యులు ఘన స్వాగతం పలికారు.
మ్యూనిచ్ నగరంలో జర్మనీకి చెందిన జనసైనికులు, వీరమహిళలతో ఆయన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. వారం రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్న నాగబాబు గారు మూడు రోజుల పాటు లండన్ లో, రెండు రోజుల పాటు ఐర్లాండ్ లో పర్యటించి పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో మమేకమైన విషయం తెలిసిందే.
నెలాఖరుకు నెదర్లాండ్స్ చేరుకొని అక్కడి జనసైనికులు, వీరమహిళలతో సమావేశమవుతారు. పార్టీ బలోపేతం, పార్టీ ఉన్నతికి జర్మనీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు కార్యక్రమాల మీద సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో నగబాబుతో పాటు జనసేన పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.