Nagababu in Ireland : జనసేన పార్టీ బలోపేతం కోసం ఎన్ఆర్ఐ సభ్యులతో నాగబాబు మమేకమై పార్టీ భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకుంటూ, అటు జనసైనికులను, ఇటు వీర మహిళలను కలిసి అభిప్రాయాలను సేకరిస్తూ పార్టీని ఇంకా బలోపేతంగా చేసి ఏ విధాన దిశగా ముందుకు తీసుకువెలితే బాగుంటుందో సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జనసేన పార్టీ సత్తా చాటాలని ఆకాంక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన యూరప్ పర్యటనను చేపట్టాగా ఐర్లాండ్ లో నాగబాబు గారికి ఘనస్వాగతం లభించింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు యూరోప్ పర్యటనలో భాగంగా ఐర్లాండ్ చేరుకున్నారు. డంబ్లిన్ విమానాశ్రయంలో నాగబాబు గారికి ఎన్టీఆర్ఎస్ఐ జనసేన ఐర్లాండ్ విభాగం సభ్యులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు.
సోమవారం ఐర్లాండ్ లోని ఎస్ఆర్ఎస్ఐ జనసైనికులు, వీర మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యక్రమాలు, పార్టీ ఉన్నతికి అందించాల్సిన సేవలపై వారితో చర్చించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క ఎన్నారై జన సైనికుడు, వీర మహిళల కృషి వెల కట్టలేనిదన్నారు.
యూరోప్ పర్యటనలో భాగంగా మూడు రోజుల క్రితం లండన్ లో పర్యటించిన నాగబాబు గారు యూకేలో మూడు రోజులపాటు పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో మమేకమయ్యారు. ఈ నెలాఖరు వరకు సాగనున్న యూరోప్ పర్యటనలో ఐర్లాండ్ తో పాటు నెదర్లాండ్స్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ పాల్గొన్నారు.