Nagababu : గల్ఫ్ దేశాల మూడు రోజుల పర్యటన ముగిసిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిది. భవిష్యత్తు తరాల కోసం మనమంతా కలిసి కట్టుగా పనిచేద్దాం. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని కొనసాగిద్దాం.
గత మూడు రోజుల పాటు గల్ఫ్ జన సైనికులు, వీర మహిళలు అందించిన ఆతిథ్యం ఆస్ట్రేలియా పర్యటన జ్ఞాపకాలను మరొక్కసారి గుర్తు చేశాయి అని నాగబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అజ్మాన్ నగరంలో “దుబాయ్ – యూఏఈ” జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, అది నా చేతులమీదుగా ప్రారంభించడం అంతులేని అనుభూతినిచ్చింది. గల్ఫ్ దేశాల కార్యకర్తల కోసం కార్యాలయం నిర్మించిన కేసరి త్రిమూర్తులు గారికి ప్రత్యేక అభినందనలు.
సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యాలయం నిర్వహించబడడం అనేది. అందరికీ ఉపయోగకరం అని అన్నారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల కోసం జనసేన హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం సంతోషకరం. వీర మహిళల సమావేశంలో సామాజిక ఉద్యమకారిణి, దూబగుంట సారా నిషేధ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీమతి టి. మణి చలపతి గారి ప్రసంగం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అని నాగబాబు స్పష్టం చేసారు.
దుబాయిలో మొక్క నాటిన అనుభవం నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సొంత అక్క చెల్లెళ్ళులా వీర మహిళలు చూపించిన అభిమానం గొప్పది అని ఆయన ఆనందాన్ని వెల్లడించారు. జనసేన ప్రభుత్వంలో ప్రజా ప్రయోజన పాలన కోసం ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో భాగస్వామ్యం చేస్తాం. సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రతీ ప్రవాస జన సైనికులు, వీర మహిళలకు ప్రత్యేకమైన అభినందనలు.
ప్రవాస భారతీయులు గతంలో అనేక సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిచ్చిన సందర్భాలు ఎంతో విలువైనవి. భవిష్యత్తు తరాల భద్రత కోసం, భరోసా కోసం మనమంతా కలిసి కట్టుగా చేస్తున్న ఈ కృషిని కొనసాగిద్దాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భావజాలం, వ్యక్తిత్వం స్ఫూర్తిగా మున్ముందు ఇదే ఉత్సాహం, పట్టుదలతో జనసేన పార్టీని బలోపేతం చేసుకుని, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజా ప్రయోజన పాలన అందిద్దాం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.