Nagababu in the Netherlands : రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాగైనా నిలదొక్కుకోవాలని, అవినీతి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దేదించాలని, అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకోవాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి మనకు విదితమే..
వారాహి విజయయాత్రతో పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలో మమేకమయ్యారు. పూర్తిగా రాజకీయ పంథా మార్చుతూ వచ్చే ఎన్నికలలో విజయ డంఖ మోగించే దిశగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు సాగుతున్నాయి. అదే నేపద్యంలో నాగబాబు విదేశీ పర్యటన చెప్పట్టారు. ఎన్నారైలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు యూరోప్ పర్యటనలో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆమ్ స్టర్ డ్యామ్ విమానాశ్రయంలో నాగబాబు గారికి ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇక్కడ రెండు రోజుల పాటు నాగబాబు గారు పర్యటించనున్నారు. ఎన్ఆర్ఐ జనసైనికులు, వీర మహిళలతో సమావేశం కానున్నారు.
గత పది రోజులుగా నాగబాబు గారు యూకే, ఐర్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి ప్రవాస భారతీయులను కలిసి పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్ లో ఉన్న ప్రవాస భారతీయులను శ్రీ నాగబాబు గారు కలిసి జనసేన పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల మీద, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రవాస భారతీయుల్లోకి ఎలా తీసుకువెళ్లాలని అంశాల పైన చర్చించనున్నారు.