Nagababu – Jagan : మ్యూనిచ్ లో జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ..కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీలో ఎవరైనా కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదగవచ్చు. ఇతర పార్టీల్లో ఇలాంటివి ఉండవు. మన ముఖ్యమంత్రినే తీసుకుంటే. ఆయనది నియంత పోకడలు. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా తానే ఉండాలని ఏకగ్రీవంగా తన పార్టీ నాయకులతో ఎన్ను కునేలా చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చెల్లవని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.
ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షుడు ఏంటి? జగన్ ది క్రిమినల్ మైండ్, ఫ్యాక్షనిస్ట్ మైండ్. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆయన పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తోలుబొమ్మలే. ఆయన ఆడమన్నట్లు ఆడాలి. పాడమన్నట్లు పాడాలి. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. ప్రజలకు ఏం చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు. అందుకే వాలంటీర్ వ్యవస్థలోని లోపాలు, టైజూస్ కుంభకోణంపై మాట్లాడారు. వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. ఆయనకు ప్రజల కోసం పోరాటం.
చేయడమే తెలుసు. ప్రయత్న లోపం లేకుండా పోరాటం చేసినోడు ఓడిపోయినట్లు చరిత్రలో లేదు. 2024లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. నియంతలు ప్రజల చేతిలో కుక్క చావు చస్తారు అని ఆయన అన్నారు. ఉపాది కి తగ్గ అవకాలు లేక సముద్రాలు దాటి కుటుంబాలను వదిలి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు. ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి కన్నీళ్లు దిగమింగి ఇక్కడ నివాసం ఉంటున్నారు. మన పిల్లలు మన రాష్ట్రంలోనే అన్ని సౌకర్యాలతో జీవించాలంటే అది జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం.
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలనకు చమరగీతం పాడాలంటే ప్రవాస భారతీయులు తమ అభిప్రాయం సోషల్ మీడియాలో దైర్యంగా షేర్ చేస్తే చాలు, ఇతర పార్టీలు కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో పెయిడి వార్తలు రాయిస్తున్నాయి. వాటిని ఎంతో దైర్యంగా ఎదుర్కొంటుంది. జన సైనికులు, వీరమహిళలే. అధికార పార్టీ నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సంధిస్తున్న ప్రశ్నలు చూసి ప్రజల్లో మార్పు మొదలైంది.
ప్రతి ఒక్కరు ఆలోచించడం. మొదలుపెట్టారు. అలాంటి వ్యక్తి శాసనసభలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన సంధించే ప్రశ్నలు, లేవనెత్తే అంశాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. మామను చూసి అల్లుడికి ఓటు వేశారు. తండ్రిని చూసి కొడుక్కి ఓటు వేశారు. మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ కు ఓటు వేయండి అనే మెసేజ్ మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అన్నారు.