Nara Lokesh about Vyuham Movie : వ్యూహం సినిమాపై స్పందించిన నారా లోకేశ్
న్యాయపరంగా మాకున్న హక్కుల కోసం పోరాడుతున్నాం అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఎన్నికల ముందు సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయింది అని ఆయన మండిపడ్డారు. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది అని హెచ్చరించారు లోకేష్..
వై ఏపీ నీడ్స్ జగన్ పై నారా లోకేష్ సెటైర్ మాములుగా లేదుగా..
ఇలాంటి సినిమాలకు జగన్ డబ్బులు పంచుతున్నారు అంటూ జగన్ ని విమర్శించారు లోకేష్.. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ లాయర్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు జగన్ కి నిజంగా సినిమా తీయాలంటే.. హుకిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్‍లో జరుగుతున్న అవినీతిపై సినిమా తీయొచ్చు అని అన్నారు..