Naresh Pavithra: హైదరాబాద్ నడిబొడ్డున నరేష్-పవిత్రల ఇంద్ర భవనం.. ఎన్ని కోట్లు అయి ఉండొచ్చు?
Naresh Pavithra: సినిమా పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నరేష్ ఇప్పుడు తన కొత్త ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన నిర్మించుకున్న ఈ విలాసవంతమైన ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నగరానికి నడిబొడ్డున సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని నరేష్ – పవిత్ర లోకేష్ జంట లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులైన మురళీమోహన్, అలీతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అతిథులు నరేష్ ఇంటిలోని ప్రతి అణువునూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రవేశ ద్వారం నుంచి మాస్టర్ బెడ్‌రూమ్‌లు, విశాలమైన వంటగది, జిమ్, వరండాలు, సుందరమైన తోటలు… అన్నీ అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఈ ఇల్లు కేవలం ఒక నివాసం మాత్రమే కాదు, నరేష్ వ్యక్తిత్వాన్ని, అభిరుచిని ప్రతిబింబించే ఒక కళాఖండంగా మారింది. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వరండాలో ఉన్న భారీ ప్రపంచ పటం ఏర్పాటు చేశారు. ఈ ఇంటి విలువ, దాని నిర్మాణ శైలి ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ కొత్త ఇంటి ప్రారంభోత్సవం తర్వాత నరేష్ ఆస్తుల విలువపై మళ్లీ చర్చ మొదలైంది. దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల ఏకైక వారసుడిగా నరేష్‌కి పెద్ద మొత్తంలో భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయని సమాచారం. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ సమీపంలో ఉన్న సుమారు ఐదు ఎకరాల ఫామ్‌హౌస్ విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
https://www.facebook.com/iDreamShortFilms/videos/1802553943680354/?rdid=YK6URygPy5LgLE4s#
అలాగే, మొయినాబాద్, శంకరపల్లి పరిసరాల్లో మరో 30 ఎకరాల వ్యవసాయ భూములు కూడా నరేష్ పేరు మీద ఉన్నాయని, వాటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఆయన ఆస్తుల విలువ రూ.400 కోట్లను దాటుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం నరేష్ కొత్త ఇంటి వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
