Ndendla Manohar : జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు ఆ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మరోసారి రుజువైంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ అన్నపరెడ్డి నాగశివయ్య ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగశివయ్య కుటుంబాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు.
అతని భార్య శ్రీమతి పావనినీ ,మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపి,పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు పంపిన రూ.5 లక్షల బీమా చెక్కును ఆమెకు అందచేశారు. పార్టీ తరపున అన్ని విధాలా ఆ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆ తరువాత ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన మరో ముగ్గురు క్రియాశీలక సభ్యులకు మెడిక్లెయిమ్ చెక్కులు నాదెండ్ల మనోహర్ అందచేశారు. తాడికొండ నియోజకవర్గం కొర్రపాడుకు చెందిన శ్రీ హరిగోపాల్ కు రూ. 50 వేలు, గుంటూరు పట్టణానికి చెందిన శ్రీ దాసరి హరికృష్ణ బాబుకు రూ. 50 వేలు, రేపల్లె నియోజకవర్గం, పెనుమూడి గ్రామానికి చెందిన శ్రీ ఆళ్ల నాగ శ్రీధర్ కు రూ. 25 వేల చెక్కులు ఇచ్చారు.