Street Food Kamari : ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉండటంతో సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగించుకొని చాలా సులభంగా ఫేమస్ అయిపోతున్నారు. ఇంకొందరు వీడియోస్, వ్లాగ్స్, ప్రపంచ యాత్రలు, వంటల వీడియొలు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు. దీనికితోడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా మధ్యమాలు వ్యూస్ ని బట్టి డబ్బు కూడా చెల్లిస్తూ ఉండడంతో కొందరు ఇదే ఆదాయ వనరుగా మార్చుకొని లైఫ్ లీడ్ చేస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటం కోసం కొందరు విచిత్రంగా వీడియోలో తీస్తుంటే మరికొందరు మాత్రం పలు రకాల వ్యాపార సంస్థలు ప్రమోట్ చేస్తూ అడ్వర్టైజింగ్ కూడా ద్వారా బాగానే డబ్బు గడిస్తున్నారు.
Street Food Kamari Famous:
అయితే గత రెండు నెలల నుంచి ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్లో బాగా పాపులర్ అయినటువంటి వారిలో స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమె దగ్గర స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చిన కొందరు తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. దీంతో చాలామంది యూట్యూబ్లో, ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే సినీ సెలబ్రిటీలు సైతం వెళ్లి కుమారిని కలిసి ఆమె స్ట్రీట్ ఫుడ్ సెంటర్లో భోజనం చేశారు. దీంతో ప్రస్తుతం కుమారి కుమారి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ స్టార్ హోటల్ రేంజ్ లో పాపులర్ అయింది. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా కుమారి స్టేట్ ఫుడ్ సెంటర్ కి వచ్చి భోజనం చేస్తుండడంతో ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి నెలకొంది.

స్ట్రీట్ ఫుడ్ కుమారి నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ :
దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు కుమారి కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి. అయితే తాజాగా స్ట్రీట్ ఫుడ్ కుమారి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ప్రముఖ వెబ్ సిరీస్ మరియు సినీ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లేక్స్ స్ట్రీట్ ఫుడ్ కుమారి జీవితగాధ ఆధారంగా మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుందని తొందరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసినటువంటి ఖాతాదారులు తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా కుమారి పై ఎలాంటి డాక్యుమెంటరీ తీయడం లేదని ఇది కేవలం సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని పేర్కొన్నారు.
Preeti jhangiani : తమ్ముడు చిత్రం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో మీరే చూడండి..
KYC Fraud : జాగ్రత్త.. అలాంటి లింకులు క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ డబ్బు మాయం
అయితే ఈ విషయం ఇలా ఉండగా కొంతమంది యూట్యూబ్లో ఈమధ్య ఇంటర్వ్యూల పేరుతో కుమారి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర మైకులు పట్టుకుని తిరుగుతున్నారని దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి చివరికి ఈ కారణంగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ని తొలగించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసే వరకు వచ్చింది. కానీ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మరికొందరు సినీ సెలెబ్రెటీలు స్పందించడంతో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ని కొనసాగించవచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ మరికొందరు మాత్రం యూట్యూబర్లు అలాగే మీడియావాళ్ళు స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను అలాగే పనికిమాలిన వ్లాగ్స్ తీయడం మానేసి అన్యాయం, అక్రమాలు జరుగుతున్న వాటిని చూపిస్తూ న్యాయంపై దృష్టి పెడితే బాగుంటుందని సోషల్ మీడియా మాధ్యమాలలో కామెంట్లు చేస్తున్నారు.