Preeti jhangiani : కొంతమంది హీరోయిన్లు వెండితెరపై కనిపించింది తక్కువ సినిమాల్లోని అయినప్పటికీ తమ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రం మరియు అటు కమర్షియల్ గా ఇటు మ్యూజికల్ గా బాగానే హిట్ అయింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన ప్రీతి జింగానియా (Preeti jhangiani) టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
Trisha : 4 పదుల వయసులో కూడా ఈ బ్యూటీ కి ఆఫర్లు తగ్గడం లేదుగా..
Preeti jhangiani తమ్ముడు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ :
అయితే నటి ప్రీతి జింగానియా తెలుగులో 1999లో తమ్ముడు చిత్రం ద్వారా హీరోయిన్గా కెరియర్ ని ఆరంభించింది. ఈ చిత్రం ద్వారా ప్రీతి జింగానియా తన ప్రతిభను నిరూపించుకోవడంతో తన పుట్టినిల్లు అయిన ముంబైలో వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా నాలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇక తెలుగులో తమ్ముడు చిత్రంలో నటించిన తర్వాత నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత మోహన్ బాబు మరియు అక్కినేని నాగార్జున కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రంలో అధిపతి చిత్రంలో మోహన్ బాబు కి జంటగా నటించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రీతి జింగానియా మళ్లీ బాలీవుడ్ కి వెళ్లి పలు చిత్రాలలో నటించింది. ఈ క్రమంలో 2008వ సంవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు, మోడల్ అయిన పర్వీన్ దబాస్ ని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా ప్రీతి జింగానియా అడపాదడపా చిత్రాలలో నటించింది. కానీ ఈ చిత్రాలు పెద్దగా అమ్మడి కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. దీంతో ప్రస్తుతంప్రీతి జింగానియా సినిమా ఇండస్ట్రీపై పెద్దగా దృష్టి సారించడం లేదు.
Sivaji : హీరో శివాజీ ఒకప్పుడు అలాంటి పని చేసేవాడని మీకు తెలుసా..?
సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా అప్డేట్స్ :
కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో మాత్రం ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ మరియు ఫోటోషూట్ ఫోటోలు, వీడియోలు వంటివి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కాగా తాజాగా ప్రీతి జింగానియా తనకు సంబంధించిన ఓ అందమైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా నాలుగు పదుల వయసులో కూడా ప్రీతి జింగానియా అందం, అభినయం ఏమాత్రం తగ్గలేదని ఇప్పటికీ ఆమెకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఎలా ఉండగా గత ఏడాది ప్రీతి జింగానియా హిందీలో ప్రముఖ దర్శకుడు సాహిల్ సంగా దర్శకత్వం వహించిన కఫాస అనే వెబ్ సిరీస్ లో నటించింది కానీ ఈ వెబ్ సిరీస్ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలచించలేకపోయింది. కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి అయిన సోనీ లివ్ లో ప్రసారమవుతుంది.