Odisha Train Accident : ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని నివ్వెర పోయేలాగా దిగ్భ్రాంతికి గురిచేసింది. చూస్తుండగానే వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతటి ఘోర ప్రమాదాన్ని ఎవరు ఊహించలేదు. అసలు ప్రమాదానికి గల కారణాలను కూడా అధికారులు తేల్చలేక పోతున్నారు.
అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలేంటి.. కోరమండల్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందగా..చాలామంది తీవ్ర గాయాలకు గురయ్యారు.
బాలాసోర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ పెను ప్రమాదం సంభవించింది. అత్యంత ఈ ఘోర ప్రమాదంలో 233 మంది మరణించారని తెలుస్తున్నప్పటికీ.. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్షతగాత్రుల అర్ధనాథాలతో ఆ ప్రదేశం మొత్తం నిండిపోయింది. ఇంకా ఎంతోమంది భోగిలమధ్య చిక్కుకొని ఉండవచ్చును..
శవాలు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం 6.55 నిమిషాల ప్రాంతంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ స్టాపు లేనటువంటి బహనాగా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళింది. లూప్ లైన్ లోకి వచ్చిన ఆ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడం, బోగీలు పక్కనున్న ట్రాక్ పై పడిపోవడం, అదే ట్రాక్ పై వస్తున్న యశ్వంతపూర్ – హౌరా ఎక్స్ప్రెస్ పడిపోయిన కోరమండల్ భోగిలను ఢీకొట్టడం క్షణాలలో జరిగిపోయింది.
అయితే కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు ఎలా తప్పిందనే విషయం అధికారులకు ఇంకా అర్థం కాకపోవడం గమనార్హం. ఎటువంటి నిర్లక్ష్యపు జాడలు ఇంత పెను ప్రమాదం సంభవించడానికి కారణమో ఇంకా వెలుగులోకి రాకపోవడం రైల్వే వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. రైలు ప్రమాదంపై అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్
ఢీ కొట్టిందని, లూప్ లైన్ లోకి వచ్చినప్పుడు అక్కడ గూడ్స్ రైలు ఉందని, కానీ లూప్ లైన్ లోకి రావడానికి సిగ్నల్ ఎవరు ఇచ్చారు అనేది తెలియడం లేదని, 120 కిలోమీటర్ల వేగంతో ఎక్స్ప్రెస్ లూప్ లైన్ లోకి దూసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇవి ఖచ్చితమైన సమాధానాలుగా కనిపించడం లేదు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రైల్వే శాఖ వెల్లడిస్తున్నప్పటికీ, ప్రమాదం మాత్రం జరిగిపోయింది. అన్ని వందల ప్రాణాలను మళ్లీ ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఏదేమైనాప్పటికీ అమాయకులు ప్రాణాలు వదిలారు.. వారి కుటుంబాలకు తీరని దుఃఖమే మిగిలింది.