Pawan Kalyan about Volunteers : వాలంటీర్లు సేకరిస్తున్న 23 అంశాల ప్రాతిపదికల మాత్రమే సమాచారం బయటకు వెళ్తుందనుకుంటే పొరపాటే, అధికారికంగా 23 అంశాల వారిగా వాలంటీర్లు సమాచారం సేకరిస్తుంటే, అనధికారికంగా ప్రజల వ్యక్తిగత విషయాలన్నీ వారు తెలుసుకుంటున్నారు. వారి పరిధిలోని ఇళ్లలోకి చాలా డీప్ గా వెళ్తున్నారు..? ఏం చేస్తున్నారు..? వారి కుటుంబ పరిస్థితులు ఏంటి అన్న ప్రతి విషయాన్ని అనధికారికంగా తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకుంటున్న, తీసుకుంటున్న డేటా ఎక్కడికి, ఎవరి వద్దకు వెళ్లిందన్నది అసలైన ప్రమాదానికి కారణం.
హైదరబాద్ నానక్ రాంగూడలోని ఎస్ ఏ కంపెనీకి ఎందుకు ఈ డేటా వెళ్తోంది..? గత నాలుగున్నర ఏళ్లలో వాలంటీర్లు సేకరించిన డేటాను మూడు ప్రైవేటు కంపెనీలకు మార్చారు. దాని వెనుక ఉన్న వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు ఎవరు అనేది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజల డేటాను తీసుకుంటున్నారు కాబట్టి.. పూర్తి వివరాలను ప్రజలకి తెలియజేయాలి. దీనిపై కేంద్ర హోంమత్రి అమిత్ షా గారితోనూ చర్చించాం. డేటా చౌర్యం గురించి ఆయన ఆందోళన చెందారు. అది ఎంత పెద్ద నేరమో వివరించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు.
చేయకూడని పనులు వాలంటీర్లతో చేయిస్తున్నారు. వాలంటీర్లకు తెలిసో,తెలియకో ప్రభుత్వం చేయిస్తున్న నేరంలో ఇరుక్కుపోతున్నారు. డేటా చౌర్యం కేసులో చిక్కుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో జరిగిన తప్పుల్లో సైతం మా వెనక పెద్ద వ్యక్తి మద్దతు ఉందని అప్పటి సివిల్ సర్వీసు అధికారులు. తప్పులు చేశారు. ఆ అధికారులను ఆ తప్పులు తర్వాత వెంటాడాయి. తప్పులు చేస్తే వ్యక్తిగత మద్దతు ఉన్నా చెప్పించుకోవడం కుదరదు అని పవన్ వెల్లడించారు.
ప్రజాస్వామ్యంలో వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది, చుట్టరికం కన్నా, చట్టాలు గొప్పవి. ఇప్పుడు కూడా వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం చేయకూడని తప్పులు చేయిస్తోంది. కేవలం రూ.5 వేల వేతనం ఇచ్చి నేరంలోకి లాగుతోంది. తెలిసో తెలియకో వాలంటీర్లు ఇరుక్కుపోతే కనీసం వారిని వైసీపీ నాయకులు తర్వత పట్టించుకోరు. అసలు ప్రతి నెలా రూ.5 వేల గౌరవవేతనం ఇస్తున్న వాలంటీర్లు ఎలా స్వచ్చంద సేవకులు అవుతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.