Pawan Kalyan Birthday : సెప్టెంబరు 2వ తేదీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిందాం అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారికి నచ్చే విధంగా, ఆయన ఆలోచనలకు తగినట్లుగా ఈసారి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తాం. దీనికోసం మొత్తం 5 కార్యక్రమాలను చేయాలని భావిస్తున్నాం. మొదటిగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తాం. దీనిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులతో కలిసి భోజనాలు చేస్తారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టినపుడు వారి కోసం కవాతు చేసి, అండగ నిలిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆకలితో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అయిదు రోజుల పాటు అప్పట్లోనే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదానం నిర్వహించాం. వారికి కష్టకాలంలో అండగా నిలిచాం, భవన నిర్మాణ కార్మికులను తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు. వారి మధ్య జన్మదిన వేడుకలు చేసుకోవడం. ఓ గొప్ప కార్యక్రమంగా నిలుస్తుంది. రెండో కార్యక్రమంగా ఢిల్లీ కాలనీలను సందర్శించి, అక్కడున్న వారికి సాయం చేసి వారి మధ్యనే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం.
తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి, సమాజంలోని అందరి ఆరోగ్యాలు కాపాడే రెల్లి సోదరుల పని తీరును మా అధ్యకులవారు ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉంటారు. సమాజాన్ని శుభ్రం చేయాలంటే ఢిల్లీ సోదరుల తిరుగానే పనిచేయాలని భావిస్తారు. ఆయన జన్మదినాన్ని రెల్లి సోదరుల మధ్య ఘనంగా నిర్వహిస్తాం.. ప్రభుత్వ ఆసుపత్రుల బ్లడ్ బ్యాంకుల కోసం… మూడో కార్యక్రమంగా ఆపదలో ఉన్నవారికి రక్తదానాన్ని చేయడం కోసం మెగా రక్తదాన శిబిరాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం.
సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల బ్లడ్ బ్యాంకులకు అందజేస్తాం. ఇక నాలుగో కార్యక్రమంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలోని పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ఇతర స్టేషనరీసు ఇస్తారు. వారికి అవసరం అయిన చదువు సాయం చేస్తారు. అక్కడున్న పేద విద్యార్ధులకు తోచిన సాయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక అయిదో కార్యక్రమంగా దివ్యాంగులకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తాం. దివ్యాంగులకు అవసరం అయిన కృత్రిక ఆవయవాలు, మూడు చక్రాల సైకిళ్లు, పింఛను రాని దివ్యాంగులకు అండగా నిలిచే కార్యక్రమాలను చేయాలని ప్రణాళిక సిద్ధం చేశాం.
ఈ అయిదు కార్యక్రమాలూ పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమైన వ్యాపకాలు, కార్యక్రమాలు, ఆపదలో ఉన్న వారికి ఖచ్చితంగా సాయపడాలనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రాంతాల్లో, నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహిస్తాం. కార్యక్రమాల్లో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉరిమె ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలి అన్నారు.