Pawan Kalyan Comments On Janasena Government : ఏపీలో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతామని అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిపై జరుగుతున్న చర్చ, రాష్ట్రంలో తాజా పరిస్ధితులు, జనసేన పరిస్ధితి, వైసీపీ రాజకీయాలు వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీ నేతలను సీఎం చేసేందుకు జనసేన లేదని.. 48 శాతం ఓట్లు ఇవ్వండి అప్పుడు మనమే సీఎం అని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ లో MIM 7 స్థానాల్లో గెలిచింది. కానీ ఏపీలో మాత్రం జనసేనకు ఆ సీట్లు కూడా రాలేదు. MIMలా కాదు. కనీసం విజయ్ కాంతులా కూడా మనల్ని గెలిపించలేదే’ అని పవన్ అన్నారు. ఈసారి ఖచ్చితంగా పొత్తు ఉంటుందన్న పవన్.. త్రిముఖ పోటీ (BJP, TDP) లో
బలవడానికి జనసేన సిద్ధంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మన ప్రత్యర్థి వైసీపీనే అని పవన్ స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత సీఎం సీటు గురించి మాట్లాడుదాం. చంద్రబాబు మోసం చేస్తే మేమేమైనా చిన్నపిల్లలమా? మాకేం గడ్డాలు లేవా? తెల్ల వెంట్రుకలు రాలేవా? ఏమి తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చామా? ఎలాంటి వ్యూహాలు లేనిదే పార్టీ పెట్టామా అంటూ ప్రశ్నించారు. డిసెంబరులో ఎన్నికలు వచ్చే అవకాశముందని, జులై నుంచి ఇక్కడే ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.