Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఏంటంటే..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ పూర్తయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక ప్రత్యేక ఫోటోను కూడా హరీష్ శంకర్ పంచుకున్నారు.
గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ అదే మ్యాజిక్
గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరి కలయిక మళ్లీ తెరపై అద్భుతాలు సృష్టిస్తుందని సినీ అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. తాజాగా, పవన్ కల్యాణ్ షూటింగ్‌కు ఎంతగానో సహకరించారని, ఆయన మద్దతు వల్లే ఈ షెడ్యూల్ త్వరగా పూర్తయిందని హరీష్ శంకర్ తెలిపారు. పవన్ ఎనర్జీ, నిబద్ధత సినిమాకు మరింత శక్తినిచ్చాయని ఆయన ప్రశంసించారు. “మాటిస్తే నిలబడే నైజం.. మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే” అంటూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
క్లైమాక్స్ సన్నివేశాలు అంచనాలు పైపైకి
ఈ సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సన్నివేశాన్ని భావోద్వేగాలు, పవర్ ఫుల్ యాక్షన్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నబకాంత మాస్టర్ నేతృత్వంలో ఈ సన్నివేశాలు రూపుదిద్దుకున్నాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, హరీష్ శంకర్ విజన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
చిత్రంలో ప్రముఖ నటీనటులు
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, ‘టెంపర్’ వంశీ వంటి ప్రముఖ నటులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్ కానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.
