Pawan Kalyan : జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఏర్పడిన
విధి,విధానాన్ని, ప్రజల కాంక్షలను, త్యాగాలను, పోరాటాలను మరోసారి మననం చేసుకుంటూ.. ఎందరో పోరాటాల నడుమ ,ప్రాణ త్యాగాల నడుమ తెలంగాణ రాష్ట్ర కల నెరవేరిన రోజు. ఆ అలుపెరుగని పోరాటం, ఆశయ సాధన కోసం జరిగిన ఆ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే
ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి, ప్రతిష్టాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణత్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ తన కలలన్నీ సాకారం చేసుకొని ,ఎప్పుడు సుభిక్షంగా వర్ధిల్లాలి.
పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షిస్తూన్నట్టు తెలుపుతూ..అదేవిధంగా తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను అనీ పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.