Pawan Kalyan – Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో విరాజిల్లుతుంది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన దగ్గరి నుండీ ప్రజల బాగోగులు చూసుకోవాల్సింది పోయి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా, ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నారు. అభివృద్ధి పేరా తీవ్రమైన దోపిడీకి ప్రజలను గురి చేస్తున్నారు. వైసీపీ ఆగడాలను ప్రశ్నిస్తున్నందుకు రాష్ట్రంలో ప్రతిపక్షం అనే మాట వినపడకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వైయస్ జగన్ ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తుంది.
దాంట్లో భాగంగానే ఒకవైపు జనసేన చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకుంటూనే జనసేన పార్టీ కార్యకర్తలను వీలు అయిన చోటల్లా ఇబ్బందుల గురిచేస్తూనే సమస్యలను కల్పిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టినటువంటి కార్యక్రమంలో కూడా వైసిపి తన మూర్ఖపు బుద్ధుని బయట పెట్టుకుంది. అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రజల తరపున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు.
ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ళ దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృతిని తెలియచేస్తోంది. వారి నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.