Pawan Kalyan : ఉప్పాడ ప్రాంతంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఉప్పాడ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా అభివృద్ధి చేస్తామని, పట్టు రైతులు, చేనేత కళాకారులకు అండగా ఉంటామని తెలిపారు. దళారుల దోపిడీ లేకుండా జనసేన ప్రభుత్వం వచ్చిన సంవ్సతరం లో మార్కెట్ యార్డ్ నిర్మిస్తాం అని చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పటి వరుకు మోసగాళ్ల మాట నమ్మరు.. ఒక్కసారి నిజాయితీపరులను నమ్మి ఓట్లేయండి..
జనసేన కు అవకాశం ఇవ్వండి అని చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మనవి చేశారు. ఈ సందర్భంగా ఒక రైతు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి 3 సంవత్సరాల నుండి కదలని మా ఫైల్ మీరు వస్తున్నారు అని తెలిసి రాత్రికి రాత్రి కదిలింది. అని అధికార ప్రభుత్వ పనితీరును గురించి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మేము వస్తున్నామంటేనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తారు.. మేము వస్తున్నామని తెలిస్తేనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు..
మేము వస్తున్నామంటేనే రైతులకి ప్రోత్సాహకాలు ఇస్తారు.. ఏం మేము రాకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వరా? అని ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. చేనేత నేస్తం పేరుతొ ఒక చేత్తో ఇచ్చి.. మరోవైపు ముడిసరకు ధరలు పెంచి మరో చేత్తో రెట్టింపు లాక్కుంటున్నారు.. అలాగే అమ్మఒడి పేరుతొ డబ్బులు ఇస్తున్నట్లే ఇచ్చి నాన్న తడి పేరుతొ జేబులు గుల్ల చేస్తున్నారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి.. ఇవాళ రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారేలా విధానాలు తీసుకొచ్చారు. అని పవన్ కళ్యాణ్ అధికార ప్రభుత్వం పై మండిపడ్డారు.
దళితుల మేనమామ అని చెప్పి విదేశీ విద్య పథకంలో అంబేద్కర్ పేరు తొలిగించారు. ఒక్క పదేళ్లు జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి. రాజకీయాలకు విలువలు తీసుకొస్తం. జవాబుదారీతనం తీసుకొస్తాం అని అన్నారు. ఈరోజు ప్రభుత్వ పనితీరులో పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే..ఎమ్మెల్యే మా వాడు అయితే తప్ప గుర్తింపు రాదు అనే పరిస్థితి నుండి ఎమ్మెల్యే ఎవరైనా సరే మా హక్కులు మేము బలంగా అడగొచ్చు అనే పరిస్థితులు తీసుకురావడానికి జనసేన పోరాడుతుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పేదలందరికీ ఉచిత ఇసుక అందిస్తాం. వైసీపీ వారిలాగా 3 కంపెనీలకు కాకుండా, BC, SC వర్గాలకు అధికంగా ఇసుక కాంట్రాక్టులు ఇస్తాం, వారిని ఆర్దికంగా బలోపేతం చేస్తాం, ఇసుక దోపిడీని అడ్డుకుంటాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మొదటి రెండేళ్లలో నా పనితీరు నచ్చకపోతే రీకాల్ చెయ్యండి స్వచ్చందంగా సీఎం పదవి నుంచి తప్పుకుంటా అని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు.