Pawan Kalyan Met Chandrababu : రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి ,జనసేన పార్టీలు కూటమితో ఏకమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా వాళ్ళు వ్యూహస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు పార్టీలు ఇకపై కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే దానిమీద చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.
వాస్తవానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కాకపోయి ఉంటే ఈపాటికి భవిష్యత్ కార్యాచరణ పై ఇరు పార్టీలు ఒక క్లారిటీతో ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు వల్ల టిడిపిలో ఇంతకాలం గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్ పైన బయటికి రాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అయి, రాబోయే కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి, ఉన్న తక్కువ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, అనే అంశం పైన చర్చించినట్టు తెలుస్తుంది.
రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి. అలాగే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి. అనే ప్రధాన అంశం పైన బాబు దృష్టి సారించినట్టు వినికిడి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వాళ్ళు చాలా అంశాల పైన సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. త్వరలో మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు దానిపైన ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని సమాచారం.
అయితే టిడిపి మేనిఫెస్టో ప్రకారము గతంలోనే కొన్ని హామీలను ఆ పార్టీ నెరవేర్చింది. ఇక ఇప్పుడు జనసేన మేనిఫెస్ట్ తో పాటు టీడీపీ తుది మేనిఫెస్టో రెండిటినీ బేరీజు వేసుకొని ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించేలా ఇరు పార్టీల అధినేతలు ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. సీట్ల కేటాయింపు విషయంలో ఇరు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయి అనేది ఇక్కడ పెద్ద సమస్య. సీట్ల విషయంలో టిడిపి డామినేషన్ ఉంటుందా..? లేకపోతే పవన్ ఈ విషయంలో పట్టు సాధిస్తారా..?
అనేది మనం వేచి చూడాల్సిందే. అలాగే బిజెపిని కలుపుకొని ముందుకు వెళ్తాయా..? లేదా..? అనే విషయాన్ని కూడా ఈ రెండు పార్టీలు ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే జనసేన ఎన్డీఏ కూటమిలో భాగమై ఉంది. రాష్ట్రంలో మాత్రం బీజేపీతో నామమాత్రంగానే పోత్తులో కొనసాగుతూ వస్తుంది. మరి బిజెపి ఈ కూటమిలో భాగం అవుతుందా. ఎదురుగా ఉన్న ఇన్ని సమస్యలను పవన్ ,చంద్రబాబు ఏ రకంగా పరిష్కరిస్తారు. ఒకవేళ చంద్రబాబు ఈలోపే బెయిల్ ముగిసి మళ్లీ జైలుకు వెళ్తే అసలు పరిస్థితి ఏంటి..