Pawan Kalyan – Modi : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎల్బీ స్టేడియంలో జరిగిన బిజెపి బీసీ జన గర్జన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్, మోది చాలా సన్నిహితంగా మెదిలారు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. మోదీ సభ మూసే వరకు కూడా పవన్ కళ్యాణ్ తో చాలా ఆప్యాయంగా మాట్లాడారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద మోదీ పక్కనే కూర్చున్నారు. మోదీ తన స్పీచ్ లో కూడా పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ.. “నా వెంట పవన్ ఉన్నాడని “చాలా ధీమాగా చెప్పారు. ఆ మాటతో పవన్ కళ్యాణ్ లేచి వెళ్లి మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన ఈ సన్నివేశాలు నెట్ ఇంట్లో వైరల్ అయ్యాయి.
స్టేజ్ మీద ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ మోదీ ఏం మాట్లాడుకున్నారు..? అనే అంశం మీద ఇప్పుడు చాలా రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా పవన్ కళ్యాణ్ కి మోడీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం పట్ల జనసైనికులు” ఇది మా నాయకుడు అంటే” అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో అసలు వారిద్దరి మధ్య సంభాషణ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు.
ఏపీ పరిస్థితులు ఎలా ఉన్నాయని మోదీ అడగడంతో, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పుంటారని కొంతమంది. పవన్ మాట్లాడుతున్నంతసేపు భుజం చూపించుకుంటూ మాట్లాడారు. ఒకవేళ కోడి కత్తి కేసు గురించి మోడీ అడగాడేమో అని మరి కొంతమంది.. ఇలా కామెడీగా కామెంట్ చేస్తున్నారు. ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నా కూడా, మోదీ పవన్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వైసిపి నేతల్లో గుబులు పుట్టిందని చెప్పొచ్చు.
మొన్ననే చంద్రబాబు బెయిల్ పై విడుదలై వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని మోదీ పవన్ తో అంత సన్నిహితంగా ఉండేసరికి వైసీపీ నేతల్లో లేని అనుమానాలు రేకట్టుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా జనసైనికులు మా పవన్ రేంజ్, స్టామినా ఏంటో ఎప్పటికీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి అర్థం కాదని ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్నారు.