Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించిన విషయం మనందరికీ విధితమే. ఇప్పటికే పార్లమెంటు భావన నిర్మాణాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము వీరుల త్యాగ ఫలాలను స్మరించుకుంటూ.. రూపాయలు 75 నాణాన్నీ కూడా విడుదల చేసిన విషయం మనం గమనించాము.
అయితే కేంద్ర ప్రభుత్వ పనితీరును పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తూ.. పార్లమెంటు భవనం గురించి ఇలా అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నూతనంగా ఢిల్లీలో నిర్మించిన పార్లమెంటు భవనం గురించి మాట్లాడుతూ.. వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వక్షోత్సవాన్ని జరుపుకొంది. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు,మరెన్నో చేర్పులు.
పరాయి పాలకుల క్రీనీడలను పారదోలుతూ ఎన్నో కొంగొత్త నిర్ణయాలు,విజయాలు చవి చూశామని వెల్లడించారు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోంది. అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనం. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగ నిలయాన్ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ
గారు ప్రారంభించిన శుభతరుణాన జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన శ్రీ నరేంద్ర మోడీ గారికి, బి.జె.పి. నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ బిజెపి కృషిని ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.