Pawan Kalyan : కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒరిస్సా రాష్ట్రంలో బాలేశ్వర్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కారణాలు అధికారికంగా ఇంకా తెలియకపోయినప్పటికీ, ఆ ప్రదేశం అంతా చాలా హృదయవిధారకంగా మారిపోయింది. ఎన్నో శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎంతోమంది క్షతగాత్రుల, కుటుంభసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.
ఈ పెను ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, అత్యంత భదాకారమైన విషయం, మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 278 మంది ప్రయాణికులు మృతి చెండదం చాలా దురదృష్టంకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు విచారాన్ని వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ప్రెస్, బెంగళూరు-హౌరా ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రయాణికులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. బాధిత ప్రయాణికులకు మరియు వారి కుటుంబాలకు సహాయం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
ప్రభుత్వాలను నేను అభ్యర్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో, రైలు ప్రమాదాల నివారణకు భద్రతా జాగ్రత్తలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అలాగే మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేసారు.