Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బేవరపేట బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. జగన్ ప్రభుత్వం ఈ మధ్య చేపట్టిన ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమం అందరికీ విధితమే. అయితే ఈ స్టిక్కర్లను వైసిపి కార్యకర్తలు ప్రతి ఇంటికి అతికిస్తూ ప్రచారం చేశారు. అందులో భాగంగానే జనసేన పార్టీ కార్యకర్తల ఇళ్లకు కూడా జగన్ స్టిక్కర్లను అతికించారు. దీనిని జనసేన కార్యకర్తలు వ్యతిరేకించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం బేవరపేటలో జనసేన కార్యకర్తలు తమ ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు అతికించవద్దు అన్నందుకు వైసీపీ వాళ్ళు అమానుషంగా దాడులు చేసి జనసేన కార్యకర్తలను గాయపరిచారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు.
వారికి వైద్య ఖర్చులు నిమిత్తం జనసేన పార్టీ నుండి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులను సంబంధిత మండల అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారు అందించారు. జనసేన కార్యకర్తల పైన వైసిపి ఈ రకమైన దాడి చేయడం అమానుషమని ఈ వైఖరిని ఖండిస్తున్నామని, పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
జనసేన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తల మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.