Pawan Kalyan : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ,శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోట మరియు చిందేపల్లి గ్రామస్తులు సమావేశమయ్యారు. ఎప్పటినుండో తమ గ్రామానికి ఉన్న రోడ్డు సమస్య గురించి వారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు.
తమ ఊరికి వెళ్లే ఆర్ అండ్ బి రహదారిని ఈసీఎల్ సంస్థ మూసివేసిందని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కి తెలిపారు.ఆర్ అండ్ బి రహదారిని మూసివేయడం వల్ల గ్రామస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, ఈ రోడ్డు కోసం అప్పట్లో జనసేన చేపట్టిన పోరాటంలో పోలీసులు తమ పైన కేసులు పెట్టారని,
ఆ కేసుల వల్ల కూడా ఇప్పటికి తమ కుటుంబాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం ఏమాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ తో చెప్పి వాపోయారు. గ్రామస్తులు తమ సమస్యలను చెప్తుంటే పవన్ కళ్యాణ్ అన్ని వివరాలు తెలుసుకొన్న తర్వాత పార్టీ నుండి వారికి అండగా ఉంటామని, ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ చూసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.