Pawan Kalyan : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన నిర్వహిస్తున్నటువంటి సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వారితో సమావేశమయ్యారు. వారి యొక్క వేదనలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ చేతగాని ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టం. ప్రజల బాధలు వింటే తెలుస్తుంది వారి ఒక్కోబాధ గుండెను తాకేలాగా ఉన్నాయి.
వైసీపీ పాలన మొదలయ్యాక ప్రజలందరూ కష్టాలే అనుభవిస్తున్నారు. కష్టజీవులు, కర్షకులు, వ్యాపారులు అని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా సమస్యలతో సతమతమవుతున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను విన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ పాలనలో అన్ని రంగాలకు తీరని నష్టం జరుగుతుంది ప్రభుత్వం ఇవ్వవలసిన రాయితీలు ప్రోత్సాహకాలు నిధులు ఏవి కూడా ప్రజలకు అందడం లేదు అని అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు వారికి వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు నిజమైన కష్టపడి పని చేసే రైతులకు అందడం లేదని, కోతమిషన్లు సైతం పోరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం వల్ల వ్యవసాయానికి అధిక ఖర్చులు పెట్టుబడి పెట్టవలసి వస్తుందని వాపోయారు. విద్యుత్ కోతలతో పాటు,విద్యుత్ సరఫరాలో తరచుగా ఏర్పడే అవంతరాల గురించి పవన్ కళ్యాణ్ కి విన్నవించుకున్నారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయనకు తెలిపారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లి భూములు కౌలు తీసుకొని బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు వేసిన శ్రమ మాత్రమే మిగులుతుందని రైతులు తమ బాధను వెళ్ళబుచ్చున్నారు. ప్రతి ఒక్క కార్మిక వర్గం నుంచి వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. “జనసేన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలసీలు ఉంటాయి. అందరితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను విన్న తర్వాత అందరికీ అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటాం.
ప్రతి రంగంలోనూ సమస్యలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అందరి జీవితాలు నాశనం అయ్యాయి. సంక్షేమం చూసి, ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం సాధించే దిశగా జనసేన ప్రభుత్వంలో పాలన ఉంటుంది. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రజల జీవితాలు బాగు పడే నిర్ణయాలుంటాయి. మా ప్రభుత్వంలో ప్రజలే అంత నిర్ణీతలు అవుతారు” అని భరోసా ఇచ్చారు.