Pawan Kalyan : ప్రజలు సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించే గుణం పవన్ కళ్యాణ్ గారిది. నిత్యం ఆయన ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే.. రాజధాని అమరావతి ప్రాంతంలో పాముకాటుకు గురై మృతి చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్ కి పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు. పవన్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి బందోబస్తు కోసం వచ్చిన పవన్ పాము కాటువేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో ఆలయంలో నిద్రించినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు.
పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ప్రకటించారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న వారికి సరైన వసతులు కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్య అని, ఈ సంఘటన ఆధారంగానే ప్రభుత్వ విధానం ఏంటో తేటతెల్లమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. డ్యూటీలో ఉన్నవారికి బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న సమయంలో పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి?
అనే విషయంపై ఒక ఎస్.పి. స్థాయి అధికారి ఆధ్వర్యంలో నిర్వహణ పనులు జరగవలసి ఉంది. వారికి తగిన వసతులు ఏర్పాటు చేయవలసి ఉంది. ఎటువంటి ముందస్తు చర్యలు లేకపోవడం పవన్ కుమార్ మృతికి కారణమైందని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. పవన్ కుమార్ కుటుంబానికి తగినంత నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.