Pawan Kalyan – Rushikonda : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ లో వారాహి విజయయాత్ర చేయాలని సంకల్పించినప్పటి నుంచి అధికార ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అరచేతుల్లో పెట్టుకొని వారాహి యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది దాంట్లో భాగంగానే జగదాంబ సెంటర్లో నిర్వహించినటువంటి సభకు భారీ ఆంక్షలు విధించింది పోలీసు వ్యవస్థ.
సభలో అభివాదం చేయకూడదని వాహన ర్యాలీ నిర్వహించకూడదని ఎత్తైన భవనాలను ఎక్కకూడదని ఇలా వింత అంశాలను విధించింది పోలీసు వ్యవస్థ. వాటన్నింటిని సవాల్ చేస్తూ పవన్ కళ్యాణ్ జగదాంబ సెంటర్లో భారీ సభను నిర్వహించి చూపించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుశాఖ మరో అడుగు ముందుకు వేసి జనసేన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.
దాంట్లో భాగంగానే రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఋషికొండ కి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. ఋషికొండ పర్యాటక ప్రాంతమైనప్పటికీ నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. ఋషికొండ కు వెళ్లే అన్ని మార్గాలను బారికేట్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారు. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ధ ప్రాంతంలో ఉందా..? లేక పాకిస్థాన్లో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపించలేదు.