Pawan Kalyan – Rushikonda : ఋషికొండను సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఎన్నో విషయాలను ఆయన ప్రజానీకానికి తెలియజేయాలి అనుకున్నారు. కానీ పోలీసు శాఖ విధించినటువంటి ఆంక్షలు అక్కడ జరుగుతున్న అక్రమాలకు ఎలా పెద్దపీట వేస్తున్నాయో, అధికార ప్రభుత్వానికి పోలీసు శాఖ కూడా ఎలా వత్తాసు పలుకుతూ సపోర్ట్ చేస్తుందో అర్థమయిపోయింది.
ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి వాటిని మింగేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి దారుణమైన నాయకుడు బహుశా దేశంలో ఎక్కడా ఉండడు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలు చాలా పెద్దవి. ప్రకృతి వినాశనానికి సీఎం పాల్పడుతున్నారు.
ఇక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలకి చూపించాలి అనేదే మా ఆకాంక్ష. దీనిపై ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టుల్లో సైతం చిన్న, చిన్న ఉల్లంఘనలు జరిగాయని వైసీపీ నేతలు ఒప్పుకున్నారు. చిన్నపాటి ఉల్లంఘనలు అంటే ఇక్కడ చాంతాడంత ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఏ రాజధానీ లేకుండా ఒక్క ఆంద్రప్రదేశ్ మాత్రమే ఉందేమో.. రాజధాని గురించి జగన్ ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.
మూడు రాజధానులు అన్న పెద్దమనిషి రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేశారు. న్యాయ రాజధాని అన్న కర్నూలులో కనీసం ఉపలోకాయుక్తను కూడా నియమించలేక పోయారు. ఇలాంటి మోసం చేసే వ్యక్తికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా ఆలోచించాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు.