Pawan Kalyan – TDP : చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆంధ్ర రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ని కలవడానికి ఈరోజు రాజమండ్రి జైలుకు వెళ్లారు. ఆయన బాలకృష్ణ ఇంకా నారా లోకేష్ ను వెంటబెట్టుకొని జైల్లోకి వెళ్లడం విశేషం. అంతకుముందు చంద్రబాబు ఫ్యామిలీని కలిసి పరామర్శించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే చంద్రబాబు బెయిల్ పై విడుదలవుతారని వారికి భరోసా ఇచ్చారు.
ఆ తర్వాత జైల్లో చంద్రబాబును కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందని ఖరారు చేశారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. కేవలం ఆరు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈరోజు పవన్ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి దుమారాన్ని రేపిందో అర్థం అయిపోతుంది. ఒకవైపు చంద్రబాబు జైలుకు వెళ్ళాడు వైసీపీకి ఇంకా తిరుగులేదు అనుకుంటున్నా నేపథ్యంలో పవన్ ఈరోజు తీసుకున్న నిర్ణయం వైసిపి పక్షానికి పెద్ద చెంప పెట్టే అని చెప్పవచ్చు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అటు రాజకీయంగా ఒక కుదుపు కుదుపుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా టిడిపి తో పొత్తు అంటే వార్ వన్ సైడ్ అయినట్టే అని చెప్పేసి కొందరు తమ అభిప్రాయాలను వెల్లాడిస్తున్నారు. పవన్ తీసుకున్న నిర్ణయంతో వైసీపీ లో కూడా ఒక అలజడి మొదలైందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కొన్ని సందేహాలు కూడా వెలువడుతున్నాయి. జనసేన, టిడిపి తో పొత్తు పెట్టుకుంటే బిజెపి దానికి అంగీకరిస్తుందా..? ఒకవేళ బిజెపి దానిని అంగీకరించకపోతే జనసేన ను దూరం పెడుతుందా..? ఇది ఒక అంశం అయితే,
మరొక అంశంగా టిడిపి ,జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఈ రెండు పార్టీల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారు.. ?ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు..? ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నవాళ్లు పూర్తి మనస్ఫూర్తిగా దాన్ని ఒప్పుకుంటారా..? లేకుంటే చెరీ 2 1/2 ఏళ్లు ఒప్పంద పత్రాన్ని చేసుకొని ముందడుగు వేస్తారా..! అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు డైలమాలో ఏపీ ప్రజలను ఉంచారు. కానీ ఈరోజు తాను తీసుకున్న నిర్ణయాన్ని బహిర్గతం చేసి ఏపీ రాజకీయాల్లో ఒక అలజడిని సృష్టించారని చెప్పవచ్చు.