Pawan Kalyan – Volunteers : విశాఖ జగదాంబ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మరి కుమారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి వివరించారు వ్యవస్థ పైన తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మరల ఆయన స్పష్టం చేశారు ఆ భారీ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వాలంటీర్లు నా సోదరులు, సోదరీమణులు లాంటి వారు. సింహాచలం అప్పన్న సాక్షిగా చెబుతున్నాను.. నాకు వాలంటీర్ల మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు.
ఉన్నత చదువులు చదివి కేవలం రూ.5 వేలకు పని చేస్తున్న వారికి అవసరం అయితే మరో రూ.5 వేలు ఇవ్వాలని భావించేవాడిని తప్ప పొట్ట కొట్టాలని అనుకునేవాడిని కాదు. అయితే జగన్ వాలంటీర్లతో చేయిస్తున్న తప్పుడు పనులు మీదనే నేను మాట్లాడాను. వీటి ఆధునిక కాలంలో వ్యక్తిగత సమాచారం అనేది ఎంత కీలకమో, దాన్ని జగన్ వాలంటీర్ల ద్వారా సేకరించి, దేనికి వాడుతున్నాడనే దానిపైన నా అభ్యంతరం, వాలంటీర్ల మీద నేను ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను.
కేంద్రం నుంచి వచ్చిన సమాచారం, నివేదికలు ఆధారంగానే మాట్లాడుతాను. ఎందుర్తిలో 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, బంగారు కాజేసిన వాలంటీరు ఒకరైతే… కొయ్యలగూడెంలో చదువురాని మహిళ ఆకొంట్లోని రూ.1.50 లక్షలను ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన వాలంటీరు మరొకరు. ఇలా రోజుకో వాలంటీరు నేరాలు బయటపడుతున్నాయి. వాలంటీర్లలో అందరినీ నేను అనను. వారిలో ఉన్న కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. సేకరిస్తున్న సమాచారం సైతం వాలంటీర్లకు ఎటు వెళ్తుందో తెలియడం లేదు.
పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కీలకమైన ఆధార్ సమాచారంతో సహా అన్నీ సేకరిస్తున్నారు. ఇటీవల ప్రజల ఫోన్లకు వచ్చే అత్యంత గోప్యమైన ఓటీపీ నెంబర్లను సైతం అడిగే పరిస్థితికి వాలంటీర్లు వెళ్లిపోయారు. చిత్తూరులో ఓ యువకుడు తనకు రేషన్ రాలేదని అడిగిన పాపానికి అతడి ఇంటిని వాలంటీర్లు తగులబెట్టారు. నేను ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసేందుకు 300, వాలంటీర్ల మీద అలా ఎలా మాట్లాడతారని ఆయన అడిగారు. మరీ రోజుకో నరంలో బయటపడుతున్న వాలంటీర్ల గురించి తిరుపతి ఎస్పీ ఏమని సమాధానం చెబుతారు…??అనీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.