Pawan Kalyan – Y.S Jagan : స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వీర మహిళల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో, సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పధకాలు ఉంటాయి, తప్ప ఏ పథకమూ ఆగిపోదు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తాం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60 ఏళ్ల ఒంటరి మహిళ ఓ కాగితం పట్టుకొని నా దగ్గరకు వచ్చారు. తాను రెల్లి సామాజిక వర్గానికి చెందిన మహిళని అని, ఇంటికి దిక్కుగా ఉన్న కొడుకును అన్యాయంగా హత్య చేశారంటూ కొన్ని చిత్రాలను చూపించారు.
దీనిపై పోలీసులు పట్టించుకోవడం లేదని, మరోపక్క స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా జిల్లా అధికారులు ఎవరూ స్పందించలేదని చెప్పింది. కేసు విచారణ చేయకుండా, నిందితులను పట్టుకోవడం లేదని విలపించారు. ఓ తల్లి వేదన వినలేప్పుడు అధికారం ఎందుకు?. దండగ ఓ తల్లి వేదన తీర్చలేని అధికారం ఉన్నా ఒక్కటి, లేకున్నా ఒక్కటి అనిపిచింది. మీకు 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ప్రజలు ఇచ్చినా ఓ తల్లి గుండె ఘోష విననపుడు అధికారం ఉండి ఎందుకు దండగ అనిపించింది.
ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసినపుడు, మీకు సమాచారం ఎలా వస్తుంది..? మీరు చెప్పే సమాచారం ఎంత వరకు నిజం అని అడిగారు. ఆ ఎస్పీ గారికి చెబుతున్నా…నాకు అధికారం లేకున్నా ప్రజల బాధలు, వారి వేదనలు వినే మనసుంది. అందుకే బాధిత వర్గాలు నా దగ్గరకు వచ్చి… తమ సమస్యలు చెప్పుకుంటాయి. వారి కన్నీటి బాధను వింటానని, న్యాయం జరుగుతుందనే నమ్మకంతో వారు వస్తారు. నాకు ప్రజలే సమాచార వారధులు, ఈ ప్రభుత్వంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పే సారథులు వారే. వారి కన్నీటి నుంచి, అంతులేని నరక యాతన నుంచి వచ్చే ప్రతి మాట నాకు పోరాట స్ఫూర్తిని, ప్రశ్నించే గొంతును ఇస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.