Pawan Kalyan – Yathra : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉన్నారు. ఆయన యాత్రలో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వెళ్లిన ప్రతి చోట జన సమూహం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలుకుతూ నీరాజనాలు తెలుపుతూ బ్రహ్మరథం పడుతున్నారు అలాగే ప్రజల సమస్యలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
అధికార ప్రభుత్వము చేస్తున్న మోసాలు బట్టబయలు అవుతున్నాయి. వారాహి విజయయాత్రలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఋషికొండను సందర్శించిన విషయం విధితమే. అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాల గురించి పవన్ కళ్యాణ్ బహిర్గతం చేసి అక్రమ కట్టడాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కూడా ఆయన విచారణ వ్యక్తం చేస్తూ అధికార ప్రభుత్వం ఈ దురాక్రమాలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే
అనకాపల్లి నియోజకవర్గం విస్సన్నపేట ఆక్రమణ భూములను పరిశీలించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వాల్టా చట్టానికి తూట్లు అడ్డగోలుగా కొండలను పిండి చేసి, ఆ స్థలాలను కాజేస్తున్న వైసీపీ నాయకులు వాల్టా చట్టానికి పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. వైసీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న అడ్డగోలు దోపిడీ మీద కేంద్రం వద్ద నివేదిక ఉంది. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదు.. ఉద్యోగాలు లేవు.
ఇంకోపక్క రాష్ట్రం రోజు రోజుకి అప్పుల్లో కూరుకు పోతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు వైసీపీ నెరవేర్చింది లేదు. ఇన్ని సమస్యలు వదిలేసి వైసీపీ మంత్రులు, నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించాలనే దానిపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా ప్రకృతి వనరులను వైసీపీ నాయకులు దోచుకుంటున్న తీరు, చట్టాలను పట్టించుకోని వారి అధికార దుర్నీతిని జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రజలకు సంబంధించిన విలువైన ఆస్తులను కాజేస్తున్న వైసీపీ నాయకుల దోపిడీని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం అన్నారు.