Pawan Kalyan – YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే మహిళలు, ఆడ పిల్లల అదృశ్యంపై ఎన్సీఆర్బీ డేటాని కేంద్రం సీరియస్ గా తీసుకుంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భీమిలి ఇంచార్జి సందీప్ తన నియోజకవర్గం భీమన్నదొరపాలెం గ్రామంలో జరిగిన సంఘటన నా దృష్టికి తీసుకువచ్చారు. అలాగే నోబెల్ శాంతి బహుమతి విజేత కైలాస్ సత్యర్ధి, మరో ఎన్జీవో తో కలిసి రూపొందించిన నివేదికలో అత్యధిక చైల్డ్ ట్రాఫికింగ్ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది.
2021-22 మధ్య కాలంలో 210 చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయని వారు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది. బయటికి చెప్పుకోలేక తమ బిడ్డల్ని స్కూళ్లు మాన్పించేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. విశాఖలో ఈ నెల 10 నుంచి వారాహి విజయయాత్ర మూడో దశ ప్రారంభం నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖపట్నంలో మొదలవుతుంది.
ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు యాత్ర- కొనసాగుతుంది. యాత్రలో భాగంగా రెండు బహిరంగ సభలు, ఒక జనవాణి, ఆరు క్షేత్రస్థాయి పర్యటనలతోపాటు పార్టీ నాయకులతో నాలుగు సమావేశాలు ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన యాత్ర అద్భుతంగా జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వ అరాచకాలు ఎండగడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉపన్యాసాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
అధ్యక్షుల వారు ఒక సమస్య గురించి మాట్లాడే ముందు ఎంతో లోతుగా అధ్యయనం చేస్తారు. సమస్య పరిష్కారానికి నిపుణులు, మేధావులతో చర్చిస్తారు. సమస్యను పరిష్కరించడానికి శత విధాల ప్రయత్నిస్తారు. వారాహి విజయయాత్ర తొలి రెండు విడతలు దిగ్విజయం చేయడానికి స్థానిక నాయకులతోపాటు జన సైనికులు, వీరమహిళలు, వారాహి యాత్ర కోసం వేసిన కమిటీలు చాలా కష్టపడ్డాయి. వాళ్లందరికి అభినందనలు అన్నారు.