Pawan Kalyan – Ys Jagan : విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో అత్యంత వివాదాస్పదమైన సీబీసీఎన్సీ భూములను శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ..జగన్ చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటాం. ప్రతి దానిపైనా కొత్త ప్రభుత్వంలో విచారణ ఉంటుంది. రోజూ జగన్ కోర్టులు చుట్టూ తిరగడం ఖాయం. అన్ని అక్రమాలు జగన్ చేస్తున్నాడు అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు.
వందల కోట్ల రూపాయల విలువైన భూముల్లో జరుగుతున్న పనులను, ఆ స్థలాన్ని పరిశీలించారు. భూములు ఏదైనా మింగేయడమే. అత్యంత విలువైన భూముల అక్రమం గురించి జనవాణి కార్యక్రమంలో రాష్ట్రీయ క్రిస్టియన్ పోరాట సమితి ప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతో విలువైన మిషనరీ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని దాని గురించి మాట్లాడాలని చెప్పారు.
దీనిపై నేను పూర్తి స్థాయి విషయాలు తెలుసుకొని పరిశోధన చేసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అక్రమాలను స్వయంగా పరిశీలించాలని వచ్చాను అని తెలిపారు. జగన్ అక్రమాలకు, కబ్జాలకు మతం, కులంతో సంబంధం లేదు. సింహాచలం భూముల దగ్గర నుంచి మసీదుల భూములు, క్రిస్టియన్ మిషనరీ పరిశీలించాలని వచ్చాను. ఈ భూములపై సుప్రీంకోర్టులో విదారణ జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పనులు జరుగుతున్నాయి.
చట్టం పట్ల ఎలాంటి బెరుకు, భయం, గౌరవం లేకుండా అత్యంత విలువైన స్థలాన్ని ఆక్రమిస్తున్నారు. సుమారు 18,390 గజాల పైగా మిషనరీలకు చెందిన. ఈ స్థలం ఇప్పుడు బహిరంగంగా అన్యాక్రాంతం అవుతోంది. దీనికి అధికారమే అసలు పెట్టుబడి…సుందరమైన, ప్రశాంతమైన విశాఖ నగరాన్ని నేరగాళ్లకు అడ్డాగా మార్చారు. విశాఖ పార్లమెంట్ సభ్యుడు కుటుంబానికి సైతం రక్షణ లేదు. ఈ. స్థలం వివాదం గురించి కొందరు రౌడీ పీటర్లు ఎంపీ కుటుంబ సభ్యులను బంధించి అనేక రకాలుగా హింసించారు.
సొంత కుటుంబాన్ని కాపాడుకోలేని ఎంపీ.. అది మా పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పడం సిగ్గుచేటు. సొంత కుటుంబాన్నే కాపాడుకోలేని ప్రజాప్రతినిధి ప్రజలను ఎలా కాపాడుతాడు? తన వ్యాపారాలను హైదరాబాద్ కు మారుస్తానని, ఇక్కడ నుంచి పారిపోతానని చెప్పడానికి సిగ్గుండాలి. నువ్వు అంత భయపడితే రాజీనామా చేయలి. ఎన్నికలకు వెళ్లాం. నీకు ఓట్లు వేసిన ప్రజలను వదిలేసి వారి గురించి పట్టించుకోకుండా పక్క రాష్ట్రం పారిపోతానని ఎలా చెప్తావ్?
ప్రజలు కూడా ఇలాంటి వారికి ఓట్లు చేసినందుకు ఆలోచించాలి. విశాఖలో దొరికిన భూమిని దొరికినట్లు కాచేస్తున్న వైసీపీ నేతలను ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఈ వర్గం చేసిన దోపిడీలను భరించలేక అక్కడ ప్రజలు చైతన్యవంతులై తన్ని తరిమేశారు. ఇప్పుడు వీరి కన్ను ఉత్తరాంధ్ర ప్రాంతంపై పడింది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.